ఏపీలో ఇటీవల బంగారం నిల్వలు ఉన్న గనులు వరుసగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) నిర్వహించిన అన్వేషణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. జీఎస్ఐ అదించిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించబడ్డాయి. జిలాల్లోని ఆస్పరి మండలంలో గనులను గుర్తించినట్లు జిల్లా డీడీ రాజశేఖర్, నంద్యాల జిల్లా ఏడీ రామచంద్రలకు సర్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో గోల్డ్ నిల్వలు, నాణ్యత, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే అంశాలను పూర్తిస్థాయిలో గుర్తించేందుకు సమగ్ర సర్వే అవసరమని సర్వే అధికారులు అభిప్రాయపడ్డారు. దీనికి ముందర తుగ్గలి మండలంలో గోల్డ్ నిర్వలను గుర్తించి అక్కడ తవ్వకాలు చేస్తున్న విషయం తెలిసిందే.
దీంతో పాటు తాడిపత్రికి 12 కిలోమీటర్ల దూరంలో గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలోని జొన్నగిరి ప్రాజెక్ట్‌లో వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించేందుకు ప్రణాళికలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏడాదికి 750 కేజీల గోల్డ్ ఉత్పత్తి లక్ష్యంగా వచ్చే నవంబరులోగా కమర్షియల్ ఎక్సవేషన్ మెుదలు పెట్టాలని నిర్ణయించారు. ఈ గనులు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగడిరాయి గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఈ గనికి పదేళ్ల కిందట 2013లోనే అనుమతులు వచ్చినప్పటికీ పనులు ప్రారంభించటానికి దశాబ్దకాలం పట్టింది.
ఏపీలో బంగారు గనుల కోసం ఇప్పటికే నేషనల్ మినరల్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ దరఖాస్తు చేసుకుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గుర్తించబడిన బంగారు గనుల బ్లాకుల కేటాయింపుకు సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనికి తోడు అక్కడ అనుబంధ ఖనిజాలను తవ్వుకునేందుకు అనుమతుల కోసం దరఖాస్తుల్లో ప్రస్థావించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఏపీలోని నెల్లూరు, అనంతపురం, కర్నూలు, చిత్తూరుల్లోని గోల్డ్ మైన్స్ వార్తల్లో పెద్ద చర్చకు దారితీశాయి
మా ట్రేడ్ మార్క్ హక్కులను ఉల్లంఘిస్తున్న RTV – The Reporter TV