అనంతపురం, గుత్తి: నేటి నుండి గుత్తి మండలంలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గుత్తి తాసిల్దార్ ఓబులేష్ మాట్లాడుతూ, ఈ సదస్సులు భూమి సంబంధిత సమస్యలను పరిష్కరించడమే కాకుండా, ప్రజల ఇతర సమస్యలను కూడా అర్జీల రూపంలో స్వీకరించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ, రిజిస్ట్రేషన్, ఆర్టికల్చర్, అటవీ, దేవాదాయ శాఖల అధికారులు సంబంధిత గ్రామాలలో పాల్గొని, అవసరమైన పరిష్కారాలను అందిస్తారు. ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా ప్రణాళికలతో అధికారులు గ్రామవాసుల సమస్యలను అర్థం చేసుకొని, ఆయా సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుంటారని చెప్పారు.
ఈ సదస్సుల్లో, ప్రజలు తమ భూ సంబంధిత సమస్యలను, అలాగే ఇతర సమస్యలను కూడా అర్జీల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం పొందుతారు. అనేక గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడే ఏకైక అవకాశం, స్థానిక ప్రజల కోసం చాలా ఉపయోగకరమైనదిగా భావిస్తున్నారు.
గుత్తి ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని తమ సమస్యలపై పరిష్కారాలు పొందాలని తాసిల్దార్ విజ్ఞప్తి చేశారు.