కరీంనగర్ జిల్లా గన్నేరువరం : మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన అజయ్, సంధ్య అనే ఇద్దరు అనాధలకు ఆదివారం రాజేశ్వరి, కిషన్ అనే ఇద్దరు ఉద్యోగులు ఆర్థిక సాయం అందించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన అజయ్ సంధ్య వీరిద్దరూ తల్లిదండ్రులు కోల్పోయి అనాధలుగా అయ్యారు. ఇటీవల యువజన సంఘాల ఆధ్వర్యంలో గృహ నిర్మాణం చేపట్టారు, కాగా కరీంనగర్ లోని రేకుర్తికి చెందిన, జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలంలో రెవెన్యూ శాఖలో ఆర్ ఐ విధులు నిర్వహిస్తున్న రాజేశ్వరి, ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ లో మెకానిక్ విధులు నిర్వహిస్తున్న కూన కిషన్లు వారిని పరామర్శించి 50 కిలోల బియ్యం రూ. 2500 ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో బండి తిరుపతి, మార్గం మల్లేశం పాల్గొన్నారు.