రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్డి హరి ప్రసాద్ చేనేత దినోత్సవం రోజున ఆవిష్కరించిన రాజన్న సిరిపట్టు చీరను గవర్నర్ రాజ్ భవన్ లో జరిగే తేనీటి విందుకు హరి ప్రసాద్ ను ఆహ్వానించగా హాజరైన హరిప్రసాద్ చూసిన వెంటనే హరి బాగున్నావా అంటూ ఆప్యాయంగా భుజంపై చేయి వేసి బాగున్న మేడం అంటూ తన వెంట నేసిన చీరేను గవర్నర్ తమిళ సై చూపించగా చూడగానే బాగుంది అనడం తో ఈ చీరేలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని హరి తెలుపడంతో ఇందులో ప్రత్యేకతలు ఏమి అనగా ఈ చీరను ఆగస్ట్ 7న చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఖ్యాతి ఉట్టిపడేలా పట్టు పితాంబరం చీరలో సరి క్రొత్త డిజైన్ లో రాజన్న సిరిపట్టు అనే బ్రాండ్ తో తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయం దక్షిణకాశీగా వెలుగొందుతున్న ధార్మిక క్షేత్రమైన శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో నిత్యం పూజలు అందుకుంటున్న స్వామీ వారి ప్రత్యేకతలు ప్రతిబంభించేల చీర ను రూపొందించానని స్వామి వారికి ఎంతో ఇష్టమైన మ్రోక్కులు, కళా రూపాలు 18 రోజులు శ్రమించి డిజైన్ రూపొందించానని 23 రోజులు శ్రమించి నేయడం జరిగిందని మొత్తం దాదాపు రెండు నెలలు కష్టపడి తయారు చేసానని ఈ చీర ప్రత్యేక వెండి పోగులు, పట్టు దారంతో చేనేత మగ్గంపై చీరను నేశాను , గద్వాల్ నారాయణపేట్ సిద్దిపేట ఇలా ప్రతి ఊరుకో ప్రత్యేకమైన చీర ఉందనీ ఈ చీర కూడా అలా రాజన్న సిరి పట్టు పేరుతో శాశ్వతంగా సిరిసిల్లకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని రూపొందించానని తెలపడంతో ఆమె హరి ప్రతిభను మెచ్చుకుంటూ ఎన్ని చేనేత మగ్గాలు ఉన్నాయి అని అడగడం తో ఒక్క మగ్గం ఉందని తెలుపడం తో రెండు మగ్గాలు ఆర్థిక సహాయం చేస్తాననిగవర్నర్ హామీ ఇవ్వడంతో హరిప్రసాద్ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మగ్గం పై నేసిన వస్త్రాలకు అరుదైన అవకాశం దక్కినందుకు గవర్నర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన హరిప్రసాద్.
