కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలానికి ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య వైద్యశాల మంజూరైనట్లు జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి శనివారం తెలిపారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కృషితో మంజూరు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్,మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. రూ.1కోటి.43 లక్షలు నిధులతో దీని నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.
