జగిత్యాల జిల్లా మెట్ పల్లి ప్రభుత్వ సామజిక వైద్యశాలలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ గర్భిణీ ప్రాణాలతో చెలగాటమాడబోయారు. జగిత్యాల జిల్లా కు చెందిన పల్లపు శైలజ గణేష్, నిండు గర్భిణ ప్రసవం కోసం ప్రభుత్వం వైద్యశాలకు వచ్చింది. డెలివరీ నొప్పులు వచ్చినప్పుడు నొప్పులు రాకుండా సూది మందు, టాబ్లెట్స్ ఇస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. అసలెందుకు ఇలా జరుగుతుందని ఆరాతీస్తే డాక్టర్ల బాగోతం బయటపడింది.
విరాల్లోకి వెళితే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సేవలందించాల్సిన వైద్యులు, రోగులకు అందుబాటులో ఉండకుండా, స్వంత క్లినిక్స్ నడుపుకుంటూ నిర్లసక్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు చేస్తున్న .. డాక్టర్ అమరేశ్వర్ – మీనాక్షి హాస్పిటల్ , డాక్టర్ సాదిక్ – డెంటల్ , డాక్టర్ రాజేశ్వర్ – శ్రీకృష్ణ హాస్పిటల్ , ఇలా ఎవరికీ వారు ఆసుపత్రులు నడుపుకుంటూ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే పేద, మధ్య తరగతి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
గర్భిణులు ప్రసవానికి వస్తే సరైన సమయంలో ప్రసవం చేయకుండా స్వంత క్లినిక్స్ లో ఉంటూ .. నరల్సుల ద్వారా నొప్పులు రాకుండా ఇంజెక్షన్స్ , టాబ్లెట్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రోగుల పట్ల అక్కడి నర్సులు దురుసుగా ప్రవర్తించడం, అసహించుకోవడం, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.
ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి అక్కడి సిబ్బంది పై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.