మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఓ విద్యార్థి రెండు చేతులు లేకున్నా పరీక్ష రాసి తన అంగ వైకల్యాన్ని జయించాడు. శుక్రవారం బెల్లంపల్లి భవిత డిగ్రీ కళాశాల డిగ్రీ ఫస్ట్ ఇయర్ పరీక్ష కేంద్రానికి రెండు చేతులు కోల్పోయిన ఏలూరి శంకర్ పరీక్ష రాయడానికి వచ్చాడు. సదరు విద్యార్థి ఓ ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు అయినప్పటికీ అధైర్య పడకుండా, నిరాశ పడకుండా తోటి విద్యార్థులతో కలిసి పరీక్ష రాయటానికి హాజరయ్యాడు. రెండు కాళ్లతో పరీక్ష రాసి తానేమి తక్కువ కాదని చాటి చెప్పాడు.
పరీక్ష రాసిన విద్యార్థి
నెన్నెల మండలం కృష్ణపల్లి గ్రామవాసి కాగా ఏలూరి శంకర్ గత పది సంవత్సరాల క్రితం జరిగిన విద్యుత్ ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు.