- నిరుపేద సర్పంచ్ మృతి
- సీఎం రిలీఫ్ ఫండ్ నుండి రూ.5 లక్షలు గ్రాంట్
- ఖర్చులు కింద 2 లక్షలు దోచేసిన ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ
అల్లూరి జిల్లా, హుకుంపేట, :హుకుంపేట మండలం భారమాసి పంచాయతీ కి చెందిన వైస్సార్సీపీ సర్పంచ్ బెటికేరి పుష్పలమ్మ కొన్ని నెలల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందటంతో తన భర్త బెటికేరి మత్యరాజు అభ్యర్థన మేరకు స్థానిక ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు పెట్టడంతో సీఎం జగన్ 5 లక్షలు శాంక్షన్ చేసి చెక్ రూపంలో పంపించటం జరిగింది. కాని మృతిచెందిన సర్పంచ్ భర్త మత్యరాజు నీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ బెదిరించి రూ. 2 లక్షలు ఖర్చు నిమిత్తం ఇవ్వాలనీ లేదనంటే చెక్ నీకు చెందకుండా తిరిగి ప్రభుత్వానికే పంపిస్తానని భయపెట్టి రూ. 2 లక్షలు తీసుకోవటం జరిగిందని మత్యరాజు తెలిపారు. ఈ విషయం సీఎం దృష్టికి చేరేలా చేసి నాకు న్యాయం చేయాలని బెటికేరి మత్యరాజు కోరారు .