contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గ్రేట్ ప్లేస్ టు వర్క్’ అవార్డును గెలుచుకున్న అమర రాజా బ్యాటరీస్

తిరుపతి: ఉద్యోగులందరికీ సానుకూలమైన పని వాతావరణాన్ని అందించడంలో సంస్థ శ్రేష్ఠతను ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ గుర్తించింది. ఇందుకు గాను 2023 వ సంవత్సరానికి భారతదేశంలో ఉత్తమ కంపెనీలలో 55వ స్థానంలో అమర రాజా బ్యాటరీస్ నిలిచింది.

భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక మరియు ఆటోమోటివ్ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్, 2023లో ఉద్యోగులు పనిచేయడానికి ఉత్తమమైన కంపెనీగా ప్రతిష్టాత్మకమైన గుర్తింపును పొందినట్లు వెల్లడించింది. ‘ది గ్రేట్ ప్లేస్ టు వర్క్’ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, భారతదేశంలో పని చేయడానికి ప్రసిద్ధి చెందిన ఉత్తమ కంపెనీల జాబితాలో (2023) కంపెనీ అత్యంత ఆకర్షణీయమైన రీతిలో 55 వ ర్యాంక్ సాధించింది.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆటోమోటివ్ & ఇండస్ట్రియల్ బ్యాటరీస్, ARBL,గౌరినేని హర్షవర్ధన్ మాట్లాడుతూ, “తమ విజయానికి తమ ఉద్యోగులే చోదక శక్తి అనే నమ్మకంతో అమర రాజా బ్యాటరీస్ పునాది నిర్మించబడింది. సంస్థలోని ప్రతి వ్యక్తి వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి శక్తి, స్ఫూర్తి, సంస్కృతిని అందించడానికి తాము ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. తాము అందుకున్న ఈ సర్టిఫికేషన్, ర్యాంకింగ్ తమ ఉద్యోగులు నేర్చుకోవడానికి, ఎదగడానికి అంతులేని అవకాశాలను సృష్టించాలనే తమ అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం” అని అన్నారు.

దీనిపైన జైకృష్ణ .బి, ప్రెసిడెంట్ – గ్రూప్ హెచ్ఆర్, అమర రాజా గ్రూప్స్ స్పందిస్తూ “అమర రాజా బ్యాటరీస్ అన్ని స్థాయిల ఉద్యోగులకు వృద్ధి, ఆవిష్కరణల వాతావరణాన్ని పెంపొందించడాన్ని విశ్వసిస్తుంది, ప్రతి వ్యక్తి తమను తాము విలువైన వారుగా భావించటంతో పాటుగా వారి ఉత్తమమైన సహకారాన్ని అందించడానికి ప్రేరేపించబడతారు. ఈ గౌరవప్రదమైన ర్యాంకింగ్ , సర్టిఫికేషన్, తమ ఉద్యోగులు,తాము సేవలనందించే కమ్యూనిటీలను సానుకూలంగా ప్రభావితం చేయాలనే మా ప్రయత్నాలకు నిజమైన ధృవీకరణ ” అని అన్నారు.

ఈ అవార్డును ప్రముఖ వ్యక్తులతో కూడిన బృందం అందుకుంది; ఈ బృందంలో అమర రాజా గ్రూప్ ప్రెసిడెంట్- హెచ్‌ఆర్, జైకృష్ణ.బి, ARBL చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్, సి.నరసింహులునాయుడు, ARBL న్యూఎనర్జీబిజినెస్, బిజినెస్ హెచ్‌ఆర్ హెడ్, వివిఎస్ శ్రీధర్; అమరాన్ నేషనల్ సేల్స్ హెడ్ , మనీష్ తులి; ARBL బిజినెస్ హెచ్‌ఆర్ హెడ్, ఆటో & ఇండస్ట్రియల్ బ్యాటరీస్, రామమూర్తి , AVP-హెచ్‌ఆర్ జె.శేఖర్ వున్నారు.

‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ (GPTW) ఇన్‌స్టిట్యూట్ ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ప్లేస్ కల్చర్‌పై అథారిటీగా గుర్తింపు పొందింది. ఈ విశిష్ట సంస్థ తమ ఉద్యోగులకు సానుకూల పని వాతావరణాన్ని అందించడంలో రాణిస్తున్న సంస్థలను గుర్తిస్తుంది. ప్రతి సంవత్సరం, అనేక కంపెనీలు వీరి సమగ్ర అధ్యయనంలో పాల్గొంటాయి. అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్‌కి అందించబడిన సర్టిఫికేషన్ , ర్యాంకింగ్ , ఉద్యోగులను సర్వే చేయడం , సంస్థ పద్ధతులను అంచనా వేయడం వంటి కఠినమైన రెండు-దశల మూల్యాంకన ప్రక్రియ ఫలితాలను అందిస్తూ ఉంటుంది.

అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ ఈ విశేషమైన గుర్తింపు పట్ల సంతోషం గా ఉంది. తమ ఉద్యోగుల శ్రేయస్సు , సంతృప్తిని నిరంతరం మెరుగుపరచడానికి కట్టుబడి ఉంది.
తమ ప్రయత్నాలను గుర్తించి, తమకు ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందించినందుకు ‘ది గ్రేట్ ప్లేస్ టు వర్క్’ ఇన్‌స్టిట్యూట్‌కి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :