కరీంనగర్ జిల్లా: మానకొండూర్ నియోజవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కృషితో మొదటి విడుతగా గన్నేరువరం మండల వ్యాప్తంగా 348 (ఇండ్లు) గృహలక్ష్మి పథకం కింద జిల్లా కలెక్టర్ గోపి మంజూరు చేశారు, గృహలక్ష్మి పథకాన్ని మొట్టమొదటిగా గన్నేరువరం మండలంలో ప్రకటించినందుకు మంత్రివర్యులు గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, మానకొండూరు శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ లకు గన్నేరువరం మండల జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.