- వివిధ కారణాలతో పరీక్షలకు సన్నద్ధం కాలేదని విజ్ఞప్తులు
- దీంతో పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం
- పరీక్ష ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్న ఏపీపీఎస్సీ
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. పాలనాపరమైన కారణాలతో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంది. ఏప్రిల్‌లో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చాయి. మెయిన్స్‌కు 92 వేలమంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.
అయితే సిలబస్‌లో మార్పులు, ఎన్నికల ప్రక్రియ కారణంగా పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని, కాబట్టి పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్లు వచ్చాయి. నిరుద్యోగుల అభ్యర్థన దృష్ట్యా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది.