కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి,ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం గృహ లక్ష్మి పథకంలో ఆహార భద్రత కార్డు తప్పనిసరి అనే నిబంధనను సడలించాలని ప్రజావాణిలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు చిగురుమామిడి జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ నిర్మించుకోవడానికి గృహలక్ష్మి పథకంతో 3 లక్షల రూపాయల ఆర్ధిక సహాయమంచిందించడం సర్వత్రా హర్షణీయమన్నారు. దరఖాస్తు దారులు ఆహార భద్రతా కార్డు కలిగి ఉండాలనే నిబంధన ఉండడం మూలంగా చాల మంది నిరుపేదలకు ఈ పథకం వర్తించడం లేదన్నారు. గత 5,6 సంవత్సరాలలో అర్హులైన అందరికి నిరంతరంగా రేషన్ కార్డులు జారీ చేయుటలో జాప్యం జరిగింది. దారిద్ర రేఖకు దిగువ నుండి పూర్తి అర్హత కలిగిన కుటుంబాలకు రేషన్ కార్డులు అందుబాటులోకి రాలేదన్నారు. అంతేగాక దరఖాస్తు దారులు మహిళల పేరున మాత్రమే అప్లై చేసుకోవాలి కాబట్టి కొత్తగా గత 5, 6 సంవత్సరాల నుండి కొత్తగా పెళ్ళై అత్తారింటికి వచ్చిన మహిళలకు రేషన్ కార్డుల్లో చేర్పులు, మార్పులు జరుగ లేదన్నారు. మరియు ఒకే కార్డులో నమోదైన కొడుకులకు పెళ్లిళ్లు అవడం మూలాన వేరు వేరు కుటుంబాలుగా బ్రతుకుతున్నప్పటికీ వేరు వేరు రేషన్ కార్డులు జారీ చేయ బడలేదన్నారు. ఈ కారణాల వల్ల గృహలక్ష్మి పథకానికి పూర్తి అర్హతలు ఉన్నప్పటికీ రేషన్ కార్డు లేని కారణంగా నిరుపేద కుటుంబాలు అప్లై చేసుకోలేకపోతున్నారు. అర్హులైన పేద కుటుంబాలకు లబ్ది జరుగుటకు గాను ఆహార భద్రత కార్డు తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను సడలించి, రేషన్ కార్డు లేని వారికి ఆదాయ దృవీకరణ పత్రముతో అర్హులుగా ప్రకటించాలని ప్రభుత్వానికి విన్నవించారు.