కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన పంబల కొమురయ్య సం (54) అనే రైతు బుధవారం అనుమానాస్పద స్థితిలో తన వ్యవసాయ పొలం వద్ద మృతి చెందాడు. పోలీసులు కుటుంబ సభ్యుల కథనం మేరకు పంబల కొమురయ్య తన ద్విచక్ర వాహనంపై భార్య విజయా ని తీసుకొని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల వద్ద దింపి పొలం వద్దకు వెళ్లాడు. అనంతరం ఉపాధి హామీ పనుల నుంచి ఇంటికి వచ్చిన భార్య భర్త రాకపోవడంతో భావి వద్దకు వెళ్ళింది. అక్కడ గాలింపు చేపట్టగా పొలం గట్టుపై మృతి చెంది ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. అలాగే సంఘటన స్థలానికి ఏఎస్ఐ లక్ష్మీనారాయణ, హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామిలు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మోచేతులు నుదుటిపై గాయాలను గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, మృతికి గల పూర్తి కారణాలు తెలియ వలసి ఉంది. మృతుడికి కుమారుడు రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.