అనంతపూర్ జిల్లా : గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే వై వెంకట రామి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గుత్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే వై వెంకట రామి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబాన్ని వర్తింప చేయడానికి ప్రవేశపెట్టిందన్నారు. అతి తక్కువ గౌరవ వేతనంతో వాలంటీర్లు ప్రభుత్వానికి తమ సేవలను వర్తింప చేస్తున్నారన్నారు. వాలంటీర్ల ద్వారానే ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి చేరుతున్న అన్నారు. సేవ చేయడమే ముఖ్యంగా అమల్లోకి తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థ నేడు ప్రభుత్వ పథకాలకు వాటి అమలులో కీలకపాత్ర పోషిస్తున్నారు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న డబ్బును నేరుగా వారి ఖాతాల్లోనే జమా చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యక్రమాలకు ఆలోచనలకు అండగా నిలుస్తూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి వాలంటీర్ ఒక సైనికుడుతో సమానం అన్నారు వారి సేవలు ప్రభుత్వం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు ఈ సందర్భంగా ఆయన సంక్షేమ పథకాలలో చురకైన పాత్ర పోషించిన పలువురు వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించి నగదు అభినందన పత్రాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూరుబి నియోజకవర్గ నాయకులు శ్రీనివాసరెడ్డి ఎంపీపీ గాండ్లపాటి విశాలాక్షి వైస్ చైర్మన్ వరలక్ష్మి పద్మలత రెడ్డి జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి గుత్తి మండల నాయకులు హుస్సేన్ పీర గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.