గుంటూరు, ది రిపోర్టర్ : ఎస్టీ బాలికను ప్రేమించాను అని నమ్మించి మాటలు కలిపి మోసం చేసిన ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువురు గ్రామంలో చోటుచేసుకుంది.కులం పేరు తో అవమానించడం తో పురుగుల మందు తాగి ఎరుకల యువతి మృతి చెందింది.ఈ సంఘటన పై ఏకలవ్య ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల కొండయ్య మాట్లాడుతూ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువురి గ్రామము లో కట్టా రాము అనే పేద ఎరుకల ఎస్టీ రైతు కూలీకి ఇద్దరు పిల్లలు ,,ఒక బాబు (పుట్టుకతో వికలాంగుడు)ఒక పాప కళ్యాణి ( 17) (మైనర్) .అదే గ్రామానికి చెందిన కమ్మ కులానికి చెందిన తోటకూర వర్షిత్ చౌదరి (20)కల్యాణి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని నమ్మించి, చాట్ చేసి మోసం చేశాడు. మన ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసింది అని కల్యాణి, వర్షిత్ తో చెప్పగా మీ కులం ఏమిటి మా కులం ఏమిటి అని అవహేళన గా మాట్లాడి మీరు ఎస్టీ వారు అంట కదా,నాకు తెలియదు, మేము కమ్మ అని నీకు తెలుసా ?అని అవహేళన గా మాట్లాడినట్లు తెలుస్తోంది.అది ఏమిటి మన మధ్య కులం ఎందుకు అని ఆ అమ్మాయి కన్నీటి పర్యంతం అయింది.ఇంత అవమానం తట్టుకోలేక ఈ నెల 8వ తేదీ న పురుగుల మందు తాగి మృత్యువు తో పోరాడి బుధవారం రాత్రి విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ తన తుది శ్వాస విడిచినారు.ఈ దుర్ఘటన జరిగినప్పుడు నుంచి ఈటియఫ్ పోరాడుతుంది.బాధిత కుటుంబాన్ని రాష్ట్ర యస్టీ కమీషన్ చైర్మన్ డివివి శంకర్రావు ఫోన్లో దైర్యంగా ఉండండి మీకు అండగా ఉంటాను ప్రభుత్వం తరుపున ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని మాటిచ్చారన్నారు. న్యాయం జరగకపోతే ఎంత వరకైనా పోరాటం చేస్తామని నల్లబోతుల కొండయ్య హెచ్చరించారు.