కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని గునుకుల కొండాపూర్ లో మైలారం కుంట ను కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి మట్టి తరలించి కుంట ను తవ్విస్తున్నారు. బుధవారం మండల తహసీల్దార్ కి ముదిరాజ్ సంఘం సభ్యులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కుటుంబాలకు జీవనాధారమైనటువంటి కుంటను మట్టిని తరలించడం వలన మాకు జీవనం ఉండదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా గ్రామంలో ఉన్నటువంటి చెరువు లకు హద్దులు నిర్ణయించాలని ముదిరాజ్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు గూడెల్లి రాములు, బచ్చంటి శ్రీనివాస్, చొక్కల మల్లేశం, చొక్కల తిరుపతి, చొక్కల శ్రీశైలం, గూడెల్లి లక్ష్మయ్య, మల్లయ్య, బోయిని వెంకటేష్స్ బోయిని మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.