గురజాల పట్టణం కు చెందిన రాజవరపు ఈశ్వర్(25) దాచేపల్లి మండలం నడికుడి రైల్వే బ్రిడ్జి దగ్గర గత రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు.. అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఐదువేల రూపాయలు ఇస్తేనే మృత దేహం ఇస్తామని లేదంటే ఇవ్వము అని బహిరంగంగా వైద్యులు తేల్చిచెప్పారు. గత రాత్రి 11 గంటల నుంచి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలు అయినా డాక్టర్ డాక్టర్ సుధీర్ మృతదేహాన్ని ఇవ్వలేదని బాధిత కుటీబీకులు ఆరోపిస్తుస్తున్నారు . దీంతో ఈశ్వర్ బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున గురజాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు.
