- వికలాంగులు వృద్ధులు వితంతు పెన్షన్ సకాలంలో అందించే విధంగా చూడాలి
- నీరుమళ్ల శ్రీనివాసరావు అఖిల భారతీయ జనసంఘ్ గురజాల నియోజకవర్గ అభ్యర్థి
అఖిల భారతీయ జనసంఘ్ గురజాల నియోజకవర్గ అభ్యర్థి నీరుమళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ వృద్దులు వితంతువుల, ఒంటరి మహిళలు, దివ్యంగుల పెన్షన్ల ను వారి ఇంటి వద్దకే వెళ్లి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ప్రతి సచివాలయంలో పదిమంది సిబ్బంది ఉన్నారు పంచాయతీ రెవిన్యూ సిబ్బంది ఉన్నారు వారి ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ల అందచేయాలని అఖిల భారతీయ జనసంఘ్ తరుపున ప్రభుత్వాన్ని కోరుచున్నాము ఏప్రిల్ నెలలో పెన్షన్ సొమ్ము సంబంధిత అధికారులకు సకాలంలో అందిచక పోవడం వలన కొన్ని ఇబ్బందులు పెన్షన్ దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ మే నెలలో ఇచ్చే పెన్షన్ల కు సకాలంలో పెన్షన్ సొమ్ము అధికారులకు ప్రభుత్వం అందచేయాలి, లేదు అంటే కావాలనే ప్రభుత్వం వృద్దులు వితంతువులను ఒంటరి మహిళలను, దివ్యంగాలను ఇబ్బంది పెట్టి ఆ నెపం ప్రతిపక్ష మీదకు నెట్టాలని చూస్తుందని భావించాల్సి వస్తుంది పెన్షన్ దారులకు ఎటువంటి ఇబ్బంది కలగా కుండ చూడవాలిసిన బాధ్యత ప్రభుత్వ అధికారులు పైన ఉన్నది అని తెలియ జేస్తున్నం అని అఖిల భారతీయ జనసంఘ్ గురజాల నీరుమళ్ల శ్రీనివాసరావు మీడియాతో తెలిపారు