పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల గ్రామం వద్ద ఉన్న ఎద్దుల వాగు ఉగ్రరూపం దాల్చింది. రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మాడుగుల ఎద్దుల వాగు ఉగ్రరూపం దాల్చడంతో మాడుగుల గ్రామం నుండి గురజాల రావడానికి ఆటంకం ఏర్పడింది. ఇటివల కాలంలో ఇద్దే వాగు లో ఇద్దరు మహిళలు వాగు ప్రవాహానికి కోట్టుకుపోయి మృతి చెందిన సంఘటన తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అంతటి ప్రవాహం రావటంతో గ్రామంలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురజాల పట్టణానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, స్కూల్ వెళ్ళెందుకు , అదేవిధంగా కోర్టు పనిమీద వచ్చేవారికి, సరుకుల రవాణా కొరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎద్దుల వాగు పై వంతెనను ఏర్పాటు చేయాలనీ ప్రజలు కోరుతున్నారు.