అన్నమయ్య జిల్లా రామసముద్రంలో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరగనున్నాయని స్థానిక వాలీశ్వరాలయం నిర్వాహకులు శనివారం తెలిపారు. సాయిబాబా ఆలయంలో ఆదివారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించునట్లు ఆలయ ధర్మకర్త లక్ష్మి పతి అర్చకులు తిన్నిలి స్వామి, కమిటీ సభ్యులు ప్రకటించారు. వారు మాట్లాడుతూ గురుపౌర్ణమి సందర్బంగా ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం ఉత్సవ మూర్తికి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు తరలివచ్చి కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు.