కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం రామక్రిష్ణా కాలనీ లోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల (గన్నేరువరం) లో 60 విద్యార్ధులు కళ్లకలక తో బాధపడుతున్నారు.కళాశాలలో 570 మంది విద్యార్థులు ఉంటారు వారిలో 60 మంది కళ్లకలక తో బాధపడుతున్నారు. వారం రోజుల నుంచి కళ్లకలక తో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ఇక్కడ హెల్త్ సూపర్వైజర్ లేకపోవడంతో హాస్టల్ నిర్వాహకులే తాత్కాలిక వైద్యం ఏర్పాటు చేసుకున్నారు.విద్యార్థులు 9 వ తరగతి కి చెందిన అక్షయ్ అనే విద్యార్థితో డ్రాప్స్ ఇప్పించి చికిత్స చేయిస్తున్న ఉపాధ్యాయులు వారం రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న విద్యార్థులు పట్టించుకోలేని అధికారులు ,హెల్త్ కు సంబంధించిన వైద్యులు కళ్లకలక శరవేగంగా ఒక విద్యార్థి నుంచి మరో విద్యార్థికి సోకుతుందని తెలిసి నిర్లక్ష్యంగా ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని తల్లిదండ్రులకు సమాచారం ఇస్తే వచ్చి తీసుకెళ్తున్నారు. కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు ఇంత నిర్లక్ష్యం అయితే పిల్లల్ని హాస్టల్ కు పంపడం ఎలా అని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.