మంచిరియల్ జిల్లా : బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల ఆధ్వర్యంలో 2023-2024 విద్యా సంవత్సరానికి గాను ఐదవ తరగతి ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ లో ఈ నెల మార్చ్ 20వ తేది వరకు దరఖాస్తు చేసుకొనుటకు అవకాశం కల్పించబడినదని బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ S.స్వరూప ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏప్రిల్ 23 న ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది అని అన్నారు. నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.