నరసింహారావును సజీవదహనం చేసిన యూసఫ్ అనే యువకుడు గుత్తికొండలో ఘోరమైన ఘటన
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన,మాల సామాజికవర్గానికి చెందిన నరసింహారావు
పల్నాడు జిల్లా,పిడుగురాళ్ళ మండలం,గుత్తికొండలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దార్ల నరసింహారావును అదే గ్రామానికి చెందిన యువకుడు యూసఫ్ సజీవదహనం చేసిన ఘటన పల్నాడులో కలకలంగా మారింది.
జూన్ 28వ తేదీన సాయంత్రం జరిగిన నరసింహారావు సజీవదహన ఘటన
సజీవదహనం చేసిన యూసఫ్ పై తక్షణమే పోలీస్ అధికారులు తగు విచారణ చేపట్టి నిందితుని కఠినంగా శిక్షించాలని ఇప్పటికే బాధితుల తరఫున పిడుగురాళ్ళ సిఐ ఆంజనేయులును,గురజాల డిఎస్పీని కోరిన దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్
ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ కమీషన్ కు ఫిర్యాదు చేశామని మంగళవారం ఎస్సీ కమీషన్ గుత్తికొండ గ్రామానికి విచ్చేసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి నిందితునిపై కఠిన శిక్ష పడేలా చర్యలు అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నదని మీడియాకు తెలిపిన డీబీహెచ్ పీయస్ అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్
నరసింహారావు సజీవ దహన కేసు విషయంలో ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి,హోంమంత్రి తానేటి వనిత బాధిత కుటుంబాన్ని పరామర్శించి బాధితకుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేసిన డీబీహెచ్ పీయస్ అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్