హనుమకొండ జిల్లా కొత్త కలెక్టర్ గా, నియామకమైన సిక్తా పట్నాయక్ రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ఆదిలా బాద్ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిన సిక్తా అక్కడి నుంచి హనుమకొండకు వచ్చారు. రాత్రి సమయం కావడంతో ఉండేందుకు నక్కలగు ట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఆమెకు బస ఏర్పాటు చేశారు. డీఆర్ వాసుచంద్ర, జిల్లా మైనార్టీ అధికారి మేన శ్రీను, సమాచార శాఖ అధికారి లక్ష్మణ్, పరకాల ఆర్డీఓ రాము, ఎమ్మార్వో రాజ్ కుమార్, ఏఓ కిరణ్ ప్రకాశ్ వెళ్లారు.
తదితరులు కలెక్టర్ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. భద్రకాళి అమ్మ కలెక్టర్ సిక్తా పట్నాయక్ వారిని దర్శించుకోనున్నట్లు సమాచారం. కాగా… జిల్లా నుంచి బదిలీ అయిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు బుధవారం ఉదయం నిజామాబాద్ వెళ్లారు.