సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూర్,బేగంపేట్, గూడెం,బెజ్జంకి,పాపయ్య పల్లి గ్రామాల హనుమాన్ దీక్ష ధరించిన హనుమాన్ భక్తులు ,మంగళవారం హనుమాన్ పెద్ద జయంతి పురస్కరించుకుని ,ఎంతో భక్తి శ్రద్ధలతో మండల దీక్ష 41రోజులు),అర్ధ మండల దీక్ష (21రోజుల),11రోజుల దీక్షల హనుమాన్ మలదరణ తో ఆంజనేయ స్వామిని స్మరించుకుంటు ,భారీ హనుమాన్ విగ్రహం తో మండలంలోని పలు గ్రామాల్లో శుభయాత్ర నిర్వహించారు. తర్వాత బెజ్జంకి హనుమాన్ భక్తులు బెజ్జంకి నరసింహస్వామి గుట్ట వద్ద గల ,టి.టి.డి కల్యాణ మండపంలో హనుమాన్ స్వాములకు భిక్ష (భోజన )కారిక్రమాన్ని నిర్వహించారు. ఈ కారిక్రమాన్ని వడ్లూర్ సర్పంచ్ నాలువల,అనిత స్వామి ,బి.ఆర్.స్ నాయకులు లింగాల లక్ష్మీన్,కనగండ్ల తిరుపతి, వివిధ గ్రామాల హనుమాన్ భక్తులు,నూనె రాజేందర్,నూనె ,శ్రీకాంత్,కొరివి తిరుపతి(కె.టి. ఎం),బుర్ర తిరుపతి, బుర్ర రవి,కొరివి అజయ్, గుడిశె శ్రీకాంత్, ఎర్రవెల్లి రాజేందర్,బెజ్జంకి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
