ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు, జర్నలిస్టులకు ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్, జాతీయ అధ్యక్షలు, వి.సుధాకర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగ అని ఆయన అన్నారు. ప్రతి గ్రామానికి శోభను తీసుకొచ్చే పండుగని… మన సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే పండుగ అని అన్నారు. భోగి, సంక్రాంతి, కనుమను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇంటింటా కొత్త కాంతులు వెల్లివిరియాలన్నారు.
తెలుగు ప్రజలకు,జర్నలిస్టు సోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి,సంక్రాంతి,కనుమను అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుతున్నాను.
— V.Sudhakar |Chairman | Print & Electronic Media (@Sudhakarpress) January 13, 2024