- జోగిపేట్ పట్టణంలో అంబేద్కర్ భవనం రెండు ఎకరాల స్థలంలో రెండు కోట్లతో నిర్మాణం చేపట్టాలి
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కి కెవిపిఎస్ దళిత సంఘాల వినతి
అందోల్ నియోజకవర్గం జోగిపేట్ పట్టణంలో అంబేద్కర్ భవనం రెండు ఎకరాల స్థలం కేటగించి రెండు కోట్లతో నిర్మించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గార్లకు కెవిపిఎస్ద దళిత సంఘాల నాయకులు కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి. విద్యాసాగర్ తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు డాకూర్ మల్లేశం బీఎస్పీ నాయకులు దుర్గయ్య, ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు భానుతేజ,అంబేద్కర్ సంఘం నాయకులు సంగుపేట చెట్టయ్య, బేలూరు సురేష్ లు వినతిపత్రం ఇచ్చారు. అంబేద్కర్ భవన నిర్మాణంకు మంత్రి హరీష్ రావు గారు హామీ
ఈ సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ మాట్లాడుతూ అందోల్ నియోజకవర్గం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉన్నది. కానీ నియోజకవర్గ కేంద్రంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భవనం లేదు. జిల్లాలోని అతిపెద్ద నియోజకవర్గంగా 9 మండలాలు కలిగి ఉన్నది. ప్రతి రోజు అనేక మంది వివిధ పనుల మీద జోగిపేట్ పట్టణానికి వస్తూ పోతుంటారు. విద్యార్థులు నిరుద్యోగ యువకులు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సామాజిక తరగతులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అత్యధికంగా కలిగి ఉన్న నియోజకవర్గం కావున నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం కొరకు రెండు ఎకరాల స్థలం కేటాయించి రెండు కోట్ల నిధులు కేటాయించి అన్ని అంగులతో అంబేద్కర్ భవన నిర్మాణం చేపట్టాలని అన్నారు. అంబేద్కర్ భవన్ నిర్మాణం కొరకు కృషి చేస్తానని మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ హామీ ఇచ్చారు