- హైదరాబాద్ బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఝాన్సీ రాణి ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయ్యారు.
సూర్యాపేట జనరల్ ఆస్పత్రి లో ఝాన్సీ రాణి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఝాన్సీ రాణి భర్తది సూర్యాపేట కావడంతో ఆమె అక్కడే ఉంటున్నారు.
ఆదివారం పురిటి నొప్పులు రావటంతో సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి వెళ్లారు. దీంతో ఎస్సై ఝాన్సీ కి వైద్యులు డెలివరీ చేశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీకి వెళ్లిన ఎస్సై ఝాన్సీ కి స్థానిక ప్రజలు అభినందనలు తెలియజేసారు.