కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సాంబయ్య పల్లె గ్రామానికి చెందిన జీల సతీష్ (32) సం,, ఉదయం 6 గంటల సమయంలో బైక్ పై వ్యవసాయ పొలం వద్దకు వెళుతుండగా మార్గమధ్యలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా అప్పటికే మృతి చెందాడు, మరణ వార్తతో శోకసముద్రంలో కుటుంబ సభ్యులు మునిగిపోయారు, మృతునికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు.