రాజీవ్ గాంధీ గారికి వీరాభిమాని . వైయస్సార్ గారికి ఆత్మీయ మిత్రుడు .
నటనకి సినిమాలకి అతీతంగా వ్యక్తిత్వంతో దశాబ్దాలుగా సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్న నిజమైన హీరో .
నాకంటూ ప్రత్యేక అభిమానులు లేరు . కాంగ్రెస్ పార్టీ అభిమానులే నా అభిమానులు .. నా అభిమానులందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అంటూ ధైర్యంగా ప్రకటించిన ధీశాలి ( సినిమాల పరంగా మిగతా వర్గాలకి వ్యతిరేకం అవుతానని తెలిసినా )
సినిమాలని , రాజకీయాలని ఎన్టీఆర్ శాసిస్తున్న రోజుల్లోనే ఎన్టీఆర్ కి వ్యతిరేకముగా సినిమాలు చేస్తూ .. 1989 ఎన్నికలలో ఎంపీగా గెలిచి . . బుల్లిరామయ్యనే ( ప్రముఖ పారిశ్రామికవేత్త ) కాదు ..ఆఖరికి పెద్దరామయ్య ( ఎన్టీఆర్ ) వచ్చినా ఎడంకాలితో తంతానని బహిరంగ సభలోనే ప్రకటించి సంచలనం సృష్టించిన నిజమైన కాంగ్రెస్ కార్యకర్త .
సినిమాలలోనే మేము హీరోలం . నిజజీవితంలో నిజమైన హీరో వైయస్సార్ అంటూ వైయస్సార్ మీద ప్రేమాభిమానులని చాటుకున్న అరుదైన వ్యక్తిత్వం . నా మిత్రుడు వైయస్సార్ నాకు పద్మభూషణ్ ఇప్పించాడని , పద్మాలయ స్టూడియో కష్టాలన్నింటినీ వైయస్సార్ తీర్చారని ప్రతీ సందర్భంలోను మిత్రుత్వాన్ని ప్రకటించే నిజమైన ఆత్మీ