contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సిఎం జగన్ పై హైకోర్టులో గిరిజన సంఘం కేసు

👉 గిరిజన హక్కులు, చట్టాలు ధిక్కరణపై వైసిపి అధినేత, సిఎం వైస్ జగన్పై హైకోర్టులో గిరిజన సంఘం కేసు.

👉 సమత జడ్జిమెంట్ను ధిక్కరించి వైసిపి ఆఫీస్ నిర్మాణానికి స్థలం కేటాయించడంపై హైకోర్టు స్టే.

👉 నైసిపి అరాచకత్వం పై హైకోర్టును ఆశ్రయించిన గిరిజన సంఘం.

👉 గిరిజన ద్రోహులైన ఎమ్మెల్యేలు, ఎంపీలను అడ్డంగా పెట్టుకోని అమాయక గిరిజన రైతుల భూమి అధికార బలంతో ఆక్రమణ.

👉 సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించి వైసిపి పార్టీకి స్థలం కేటాయించారు.

👉 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు జారీకి మాత్రం అనేక ఆంక్షలు.

👉 జిల్లా అధికార్లు గిరిజన హక్కులు, చట్టాలు కచ్చితంగా అమలు చేయాలి.

👉 గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి అప్పల నర్శ డిమాండ్.

అల్లూరి జిల్లా, పాడేరు :  గిరిజన హక్కులు, చట్టాలను ధిక్కరించి వైసిపి పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వంపై, వైసిపి పార్టీ అధినేత & రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హైకోర్టులో గిరిజన సంఘం పిటిషన్ దాఖలు చేసింది. సమత జడ్జిమెంట్ను ధిక్కరించి వైసిపి ఆఫీస్ నిర్మాణానికి స్థలం కేటాయించడంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించిందని, తక్షణమే నిర్మాణ పనులు నిలుపుదల చేయకుంటే ప్రత్యక్షంగా అడ్డుకుంటామని రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికార్లకు గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు. పి.అప్పలసర్స విజ్ఞప్తి చేస్తారు.

పాడేరు గిరిజన సంఘం జిల్లా కార్యాలయంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎల్.సుందరరావు మరియు వైసిపి భూ బాధిత  కుటుంబాలతో కలిసి గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైసిపి పార్టీ రాష్ట్రం ప్రభుత్వం గిరిజన హక్కులు, చట్టాలను కాలరాసే కుట్ర చేశారు. గిరిజన రైతు మజ్జి పోల్లన్న గత 75 సంత్సరకాలంగా సాగుచేస్తున్న భూమి లో వైసిపి ఆఫీస్ నిర్మాణం కోసం 2 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా పాడేరు మండలం, చింతలవీధి పంచాయితీ, నడింవీది గ్రామంలో మజ్జి పోల్లన్న సాగు చేస్తున్న భూమి సర్వే నెం. 151 లో 2 ఎకరాల భూమిలో వైసిపి పార్టీ ఆఫీస్ నిర్మాణానికి స్థలం ను జిల్లా కలెక్టర్ కేటాయించారు. ఒక సంత్సరానికి ఎకరా భూమి కి కేవలం  రూ.1000/- లీజు నగదు చెల్లించాలని, 33 సంత్సరకాలానికి లీజు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో వైసిపి పార్టీ వారు మొత్తం  రూ.66,000/- రూపాయల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేశారు.

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల మధ్య మాత్రమే భూ బదిలీలు నిర్వహించాలని 1/70 చట్టం పేర్కొన్న వాటిని ధిక్కరించి వైసిపి పార్టీ  ఆఫీస్ నిర్మాణానికి స్థలం కేటాయించడం దారుణం. వైసిపి పార్టీ ఆఫీస్ నిర్మాణానికి స్థలం కేటాయింపు చట్ట విరుద్ధమంటూ ఎన్ని సార్లు  అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించలేదు. గిరిజన ప్రాంతాల్లో హక్కులు, చట్టాలు ఖచ్చితంగా అమలు చేయవలసిన అధికారులు దానికి భిన్నంగా వ్యహరించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు జారీకి మాత్రం అనేక ఆంక్షలు విధించే ప్రభుత్వం వైసిపి పార్టీ ఆఫిస్ నిర్మాణానికి స్థలం కేటాయింపు అన్యాయం.

ఏజెన్సీ ప్రాంతంలో వైసిపి పార్టీ ఆఫీస్ నిర్మాణానికి స్థలంను మొండిగా కేటాయించడంపై రాష్ట్ర హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్:354 పై సవాల్ చేస్తూ గిరిజన సంఘం మరియు భూ బాధిత కుటుంబాలు మే 12 న రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో (రిట్ పిటిషన్ నెంబర్: 13099 ఆఫ్ 2923, మే 12) జరిగింది. ముద్దాయిలుగా వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (రెవిన్యూ ల్యాండ్), చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ & చైర్ పర్సన్ ల్యాండ్మేనేజ్మెంట్ రెవిన్యూ వారికి, డైరెక్టర్ గిరిజన సంక్షేమశాఖ విజయవాడ వారికి, అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్, ప్రాజెక్టు అధికారి అభిషేక్ మరియు తహశీల్దార్ పాడేరు వారిని చేర్చడం జరిగింది. వారందరికి గౌరవ హైకోర్టు నుండి స్టే ఆర్డరు కాపీ చేరుతుంది.

రాష్ట్ర హైకోర్టు స్పందిస్తూ గిరిజనేరత పార్టీకి / సంస్థకు భూమి లీజుకు గాని, లేదా ఏ రూపంలోలో హక్కులు దాఖలు చేయరాదని, వైసిపి ఆఫీస్ నిర్మాణం కోసం కేటాయించిన రెండు ఎకరాల భూమి 1/70 చట్ట దిక్కరణ కిందకి వస్తుందానీ, 1997లో సమత వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు తీర్పును పొందుపరుస్తూ, తక్షణమే వైసిపి ఆఫిస్ నిర్మాణం పనులు వెంటనే నిలుపుదల చేయాలని గౌరవ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందనావు గారు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అధికార బలంతో అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులపై ఒత్తిడి కలిగించి, గిరిజనులకు అన్యాయం చేశారు. గిరిజన ద్రోహులైన గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలను అడ్డంగా పెట్టుకొని గిరిజన హక్కులు, చట్టాలను కాలరస్తామంటే సహించేది లేదని తక్షణమే జిల్లా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని గౌరవ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు అమలుచేసి వైసిపి ఆఫీస్ నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని, లేకపోతే ప్రత్యక్షంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులూఎల్.సుందరరావు, మజ్జి సత్తిబాబు, మజ్జి నాగరాజు, మజ్జి కొండబాబు, మజ్జి పోలన్న తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :