హిమాచల్ ప్రదేశ్ లోని కులూలో ఇళ్లు కుప్పకూలడం వీడియోలో కనిపిస్తోంది. దీంతో భారీగా దుమ్ము ఎగసిపడింది. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ఆ ఏరియాలోని ప్రజలను రెండు రోజుల ముందే ఖాళీ చేయించినట్లు సమాచారం. దీంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు చెబుతున్నారు. బిల్డింగ్ ల శిథిలాల కింద ప్రమాదవశాత్తూ ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని, వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని వివరించారు. ఇప్పటికే అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయని చెప్పారు. ఈ ఘటన దురదృష్టకరమంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ ట్వీట్టర్ లో ఆవేదన వ్యక్తంచేశారు. అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణనష్టం తప్పించారంటూ అధికారులను మెచ్చుకున్నారు.
Disturbing visuals emerge from Anni, Kullu, depicting a massive commercial building collapsing amidst a devastating landslide.
It's noteworthy that the administration had identified the risk and successfully evacuated the building two days prior. pic.twitter.com/cGAf0pPtGd
— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 24, 2023
Several buildings collapsed in Anni of Kullu district in Himachal Pradesh pic.twitter.com/qJZurRnSY9
— Weatherman Shubham (@shubhamtorres09) August 24, 2023