contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హిందూ దేవాలయం పై కుట్ర .. పట్టించుకోని అధికారులు

కష్టమొస్తే దేవుడికి మొక్కుకుంటాం.. కానీ ఆ దేవుడికే కష్టమొచ్చింది. ఆలయ భూములు పరులపాలవుతుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి హైదరాబాద్ లో ఉంది. ఆలయ భూముల పరిరక్షణలో అధికార యంత్రాంగం ఉదాసీనత, చట్టాల్లో లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి. ఫలితంగా వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆలయాల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. మునిసిపాలిటీ పరిధిలో ఉన్న భూముల రేట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం వీటి విలువ వందల కోట్ల రూపాయాల్లో ఉంటుంది. పట్టణాలు, గ్రామాల విస్తరణతో ఈ భూములపై అక్రమార్కులు కన్నేస్తున్నారు… తాజాగా హైదరాబాద్, ఎల్లారెడ్డి గూడ, శ్రీనగర్ కాలనీ లో ఇటువంటి భూ కబ్జా ఘటనే వెలుగులోకి వచ్చింది.

బాధితుల వివరాల ప్రకారం: ఎల్లారెడ్డి గూడా, నవోదయ కాలనీ, గణపతి కాంప్లెక్స్ వెనక భాగంలో శ్రీ సౌడమ్మ మల్లికార్జున దేవాలయం ఉంది. ఆ దేవాలయ చరిత్ర చూసినట్లయితే సుమారు వంద సంత్సరాల చరిత్ర ఉన్నట్టు సమాచారం. అయితే కొందరు ఆంద్రోళ్ళు ఆ దేవాలయ స్థలాన్ని కబ్జా చేయాలనీ పలు ప్రయత్నాలు చేస్తున్నట్టు బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఆ దేవాలయాన్ని ఒక పేద కుటుంబానికి చెందిన వారు గత వందేళ్లుగా ఆ దేవాలయంలో పరిచర్యలు చేస్తూ … ఆ దేవాలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.

అయితే ఆ దేవాలయ స్థలం పై కన్నేసిన ఆంధ్రా పెత్తందారీ శ్రీనివాస్ (అలియాస్ పెద్ద) ఎలాగైనా సరే దేవాలయ స్థలాన్ని కాజేయాలని పన్నాగం పన్నాడు. కొన్నేళ్లుగా ఆ కుటుంబానికి నిద్ర లేకుండా చేస్తున్నాడు. దేవాలయం వైపు ఎవరు రాకుండా, వచ్చిన భక్తులను తిడుతూ .. చంపేస్తా, పొడిచేస్తా .. నరికేస్తా అంటూ భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాడు. ఆ దేవాలయానికి భక్తులు రావాలంటేనే భయపడే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా వ్యహరిస్తున్నాడు. వారి హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తూ .. వారిని మానసికంగా కులం పేరుతొ దూషిస్తూ .. అర్ధరాత్రి సమయాలలో కుక్కలను మీదికి పంపుతూ ఆ కుటుంబానికి నరకం అంటే ఏంటో చావుకు ముందే చూపిస్తున్నాడు.

బాధితురాలి మాటలు : ఒకప్పుడు దేవాలయానికి రక్షణగా ఉన్న తన భర్త, తన బిడ్డ చనిపోవడం తో కబ్జా గాళ్ళకు మరింత బలం పెరిగింది. అండగా ఉండాల్సిన బంధువులే కాసులకు కక్కుర్తి పడి శత్రువులయ్యారు. నిలువ నీడలేకుండా చేసారు. గూడు వేసుకోవడానికి కాలనిలో ఒక్కరు సహకరించలేదు. నీరు లేకుండా, రాకుండా కుట్ర చేసారు. అయినా సరే దేవాలయాన్ని కాపాడుకుంటామని ఆ బాధిత మహిళా ఒక్కతే మొండిగా ఒంటరిగా గూడు వేసుకుంది కానీ స్నానికి గది లేదు. ఒక మనిషికి కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా లేకుండా శ్రీనివాస్ (పెద్దా) తో పాటు కాలనీ వాసులు కూడా ఎందుకు ఆ కుటుంబం పై అంత కర్కషంగా వ్యవహరిచారు. కేవలం ఆ గుడి ల్యాండ్ కోసమేనా లేక ఇంకేమైనా గండికోట రహస్యముందా ?

గతంలో బాధిత కుటుంబం పెద్ద పై బంజారాహిల్స్, జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికి కేసులను నీరుగార్చారే తప్ప బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదు. శ్రీనివాస్ (పెద్దా) ఒక మానసిక వికలాంగుడిని స్టేట్మెంట్ ఇస్తున్నారు .. మరి మానసిక ఆ వికలాంగుడే ..అయితె దేవాలయానికి వచ్చే భక్తులను .. ఈ దేవాలయానికి రావొద్దు అని ఎలా అంటున్నాడు. ఇది మా కాలనీ దేవాలయం, మా దేవాలయం అని ఎలా అంటున్నాడు? చక్కగా బట్టలేసుకుని, మేడలో బంగారు గొలుసులుకోని, చేతిలో మొబైల్ పట్టుకొని వచ్చిన భక్తులను వీడియోలు తీస్తూ .. మీరెవరో తెలుసుకొని మీ అంతు తెలుస్తా .. పది నిమిషాల్లో గుడి దగ్గరి నుండి వెళ్ళిపోవాలి అని ఎలా స్పష్టంగా పలుకగలుగుతున్నాడు. దేవాలయానికి వచ్చిన భక్తులను చంపేస్తా , పొడిచేస్తా అని నోటికొచ్చిన బూతులు తిడుతూ భయాందోళనకు ఎలా గురిచేస్తున్నాడు ? నిజంగా అతని మానసిక పరిస్థితి బాగోలేక ఎవరినైనా కత్తితో పొడిస్తే ! పరిస్థితి ఏంటి ?

హిందూ దేవాలయాల పై కుట్ర చేస్తున్న వారికి అండగ ఉన్న అధికారులెవరైనా, పోలీసులైనా, కలెక్టర్ అయినా .. ఎవరైనా సరే 43 సీఆర్పీసీ, కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 40 ప్రకారం తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయిస్తాం. చట్టం ఎవరికీ చుట్టం కాదని అధికారులు గ్రహించాలి. ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదు పై నిర్లక్ష్యం వహిస్తూ క్రైమ్ సీన్ కి రాకుండా దర్యాప్తు జరపకుండా.. ఫిర్యాదులను పోలీసులకు ఇష్టమొచ్చినట్టు రాసుకుంటూ అడ్డగోలుగా వ్యహరిస్తున్నారు.

జరిగిన అన్యాయం పై మీడియా ప్రతినిధులు న్యూస్ కవరేజి కి వెళ్ళినప్పుడు మీడియా హక్కులను ఉల్లంఘిస్తూ వారి పనికి అడ్డం పడడం న్యూస్ కవర్ చేయవద్దని బెదిరింపులకు పాలుపడడం జూబిలీహిల్స్ పోలీసులకు అలవాటైందని అనుకోవాలా ? పై స్థాయి అధికారుల వత్తిడికి గురవుతున్నారా ? దీని పై మొత్తం సమాచారాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తోంది రిపోర్టర్ టివి … మరో బ్రేకింగ్ తో మీ ముందుకొస్తాం ..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :