ఆరోగ్యవంతమైన సమాజం పరిసరాల పరిశుభ్రతతోనే సాధ్యమని ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరిండెంట్ డాక్టర్ సౌమ్య మైకేల్ పిలుపునిచ్చారు. స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా ఆస్పత్రి ఆవరణలో ఆసుపత్రి వైద్య సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్య మైకేల్ మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రతతో పాటు, పరిసరాల శుభ్రతపై ప్రతి ఒక్కరు దృష్టి సారించి సీజనల్ వ్యాధులకు దూరం కావాలన్నారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ భాద్యతగా తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.స్వచ్ఛతా వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని ఆరోగ్యవంతమైన సామాజనికి సహకరించాలని డాక్టర్ సౌమ్యమైకేల్ ఈ సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.