ఆడపిల్లలపై అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే భయపడేలా శిక్షలు అమలు చేసేందుకు చట్టాలు రూపొందిస్తామని హోంమంత్రి అనిత అన్నారు. ‘గంజాయి, కల్తీ మద్యానికి బానిసలై వావివరసలు మరచిపోతున్నారు. పోర్న్ సైట్లు కూడా మైనర్లను చెడుదోవ పట్టిస్తున్నాయి.పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చేముందు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. స్కూళ్లలో విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించాలి’ అని మంత్రి సూచించారు.