తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. శనివారం నాడు ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, రహదారి భద్రత అథారిటీ ఛైర్మన్ అంజనీకుమార్, కరీంనగర్ పోలీసు కమిషనర్ అభిషేక్ మహంతిలను ఏపీకి వెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చింది.
ఇక 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)… రెండు రాష్ట్రాలకు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కేటాయించింది. అయితే, దీనిపై కొందరు అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. దాంతో డీఓపీటీ హైకోర్టులో పిటిషన్ వేసింది. చివరకు గతేడాది నియమించిన ఖండేకర్ కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్‌లను ఏపీకి వెళ్లాలని హోంశాఖ ఆదేశించింది.