ఆంధ్రప్రదేశ్ : పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంతో అప్రమత్తమైన ఆ ఇంటి సభ్యులు బయటికి పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మిద్దెపోగు యాకోబు ఇంట్లో టీవీ చూస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న వస్తువులు కాలిపోయాయి.
కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాణనష్టం జరగకపోయినా పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగింది. ఇంట్లో వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కట్టు బట్టలతో బాధిత కుటింబీకులు బయట ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే దాతలెవరైనా ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ది రిపోర్టర్ టివి తరుపున వేడుకుంటున్నాము . మిద్దెపోగు యాకోబు బ్యాంక్ ఖాతా బుక్ కాలిపోవడం వలన అతని సోదరుడు మిద్దెపోగు మరియదాసు బ్యాంక్ ఖాతా వివరాలు ఇస్తున్నాము.
బాధిత కుటుంబ వివరాలు :
9989569339 – Phone Pay / Google Pay
Middepogu Mariyadasu
Account Number : 33005899575, IFSC: SBIN0002741, State Bank of India