పలనాడు జిల్లా పిడుగురాళ్ల: పిడుగురాళ్ల లైవ్ సిటీగా పేరు మరియు వ్యాపార రంగంలో చిన్న బొంబాయి గా పేరుగాంచిన ఈ లైవ్ సిటీ బట్టిలో పనిచేస్తున్న కార్మికుడు సజీవ దహనం కనీసం ఆనవాళ్లు కూడా కనబడకుండా బూడిదైన సంఘటన పిడుగురాళ్లలో జరిగినది. పొట్టకూటికోసం ప్రమాదాల అంచున ప్రాణాలు పణంగా పెట్టి ఈ సున్నపు బట్టీలలో లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సున్నం భట్టీలలో అడుగడుగునా ప్రమాదాలకు అవకాశం ఉన్నది.
బట్టిల యాజమాన్యం సున్నం బట్టిలో పనిచేసే కార్మికులకు ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సున్నం పట్టీల యాజమాన్యం కార్మికుల కోసం కనీసం బాత్రూమ్స్ కూడా ఏర్పాటు చేయకుండా పనిచేయిస్తున్నారు.
సున్నుబట్టీల యాజమాన్యం లాభాల కోసం తాపత్రయపడే ఆలోచన , తమ దగ్గర పనిచేసే కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలోచన చేయటం లేదు.
బట్టిల వద్ద పరిశీలించినట్లయితే, బట్టీల వద్ద కనీస జాగ్రతలు తీసుకునే ఆలోచన కూడా చేయటం లేదు, ప్రమాదాలు జరిగితే తమ పలుకుబడితో లేదా రాజకీయ పల పలుకుబడి తో బయట ప్రపంచానికి తెలియకుండా కట్టడి చేస్తున్నారు.
కార్మికులకు కనీసం బీమా సౌకర్యం కల్పించ కుండా ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలను అనాధలుగా మారుస్తున్నారు. మాకు లాభాలు ముఖ్యం కానీ మీ సౌకర్యాలతో మాకు పనిలేదని తెలియజేస్తున్నారు. మీరు కాకపోతే మరొకరిని పెట్టుకుంటాము ఇష్టమైతే చేయండి లేద మానేయండని హెచ్చరిస్తున్నారు. కార్మిక చట్టాలు అన్నిటిని తుంగలో తొక్కి కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. ఈరోజు కార్మికుడు (రామిశెట్టి చిన్న బ్రహ్మయ్య) సుమారు 50 అడుగుల ఎత్తున ఉన్న బట్టి అంచున ఉండి కనీసం పట్టుకోవడానికి ఎటువంటి ఆధారం లేని స్థలంలో నిలబడి రాళ్లు వేస్తుండగా కొన్ని వందల డిగ్రీల వేడితో ఉండే బట్టీలో జారిపోయాడు అలా పడటంతో సజీవ దహనం అయ్యి బూడిదగా మారిపోయాడు తోటి కార్మికులు ఇదంతా చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఆ కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మంటల్లో కాలిపోయి, ఆ కుటుంబం అనాధగా మారిపోయింది, కేసు లేకుండా చేయటం కొరకు బట్టీల యాజమాన్యాలు రాజీ చేయటం కొరకు ప్రయత్నాలు మొదలుపెట్టాయ? కార్మికులకు కనీస వసతులు మాత్రం ఏర్పాటు చేయడం లేదు. కొన్ని దశాబ్దాలుగా ఈ పిడుగురాళ్ల సున్నబట్టి కార్మికులకు ఆరోగ్యపరంగా గాని, బీమా పరంగా గాని, ప్రభుత్వాలు గానీ, బట్టీల యాజమాన్యం గాని ఏర్పాటు చేయకుండా వారి జీవితాలతో ఆటలాడుకొనుచున్నాయి. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి కార్మికులకు ప్రభుత్వ పరంగా గాని యాజమాన్య పరంగా గాని న్యాయం జరిగేలాగా భరోసా కల్పించాలని కార్మికులకు కనీస హక్కులు చేకూరేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.