హుకుంపేట : మండలంలోని తడిగిరి పంచాయతీ అల్లంపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలురు పాఠశాలలో శనివారం విద్యార్థులు కూలీలుగా అవతారం ఎత్తి దర్శనమిచ్చారు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు ప్రజాసంఘాలు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక.ఎస్ఎఫ్ఐ పలువురు నేతలు ఖండించారు.కలం పట్టే విద్యార్థులకు పారా పట్టించడం ఉపాధ్యాయులకు వృత్తి కాదని ప్రజాసంఘాలు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక.ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. పాఠశాల పరిసరాల ప్రాంతాలకు మట్టి పని కూలీలుగా మార్చడం సరికాదని విద్యార్థులకు మట్టి పనిలో కూలిగా చేయటంతో ప్రజా సంఘలు బాలల హక్కుల పరిరక్షణ వేదిక.ఎస్ఎఫ్ఐ పలువురు నేతలు ఖండించారు. అనంతరం విలేకరులతో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి. జీవన్ మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సహం కల్పించి విద్యపై మక్కువ చూపించాలని ఆయన అన్నారు. పాఠశాలలకి పరిమితమైన విద్యార్థులకు విద్యతో పాటు క్రీడా సంస్కృతి సంగీతం తదితర రంగాల్లో కూడా ప్రోత్సాహం అందించాలన్నారు. పాఠశాలలో పూర్తిస్థాయిలో మెను అమలుతో పాటు నాణ్యమైన విద్య అందించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు కూలీలుగా మార్చి పనులు చేపిస్తే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. పాఠశాలలకు అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా విద్యార్థులకు అనేక పర్యంతం పనులు చేపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పాఠశాలలో గిరిజన విద్యార్థులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించకుండా నిర్లక్ష్యం వహిస్తూ పిల్లలు ఆరోగ్యాలతో దృష్టి సారించకుండా కూలీలుగా మార్చడం సమంజసం కాదని ఆయన మండిపడ్డారు.పాఠశాలలో పనులపై దృష్టి పెట్టించి చేపిస్తే విద్యకు దూరమైన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
ఇటు వంటి ఘటనలు మళ్లీ పునర్వృతం కాకుండా చూడాలని లేకుంటే విద్యార్థులు కలిసి భారీ ఎత్తున ఆందోళన చేపడతామన్నారు