హుకుంపేట,: మండలం కొట్నాపల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదమే తప్పింది. ఉప్ప నుంచి పాడేరు వెళ్తున్న బస్ కొట్నాపల్లి మీదగా పాడేరు చేరుకునే క్రమంలో ప్రమాదం జరిగింది.
పెదగరువు నుంచి హుకుంపేట వరకు జాతీయ రహదారు పనులు జరుగుతున్న క్రమంలో గ్రామ చివరలో రోడ్డు కాల్వర్ట్ వద్ద గుంట తీసి మట్టి సరిగ్గా పూడ్చకపోవడం వల్ల బస్ జారిపోయింది . .
కోట్నాపల్లి ఎంపీటీసీ బాలకృష్ణ ఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించి అనంతరం జాతీయ రహదారి నిర్మాణ గుత్తేదారి తో రోడ్డు పనులు చేసినప్పుడు వాహనదారులు ఇబ్బంది లేకుండా రోడ్డు పై వాటరింగ్ చేయక పోవడం వల్ల దుమ్మి ,ధూళి , లేచి వాహనదారులకు ప్రయాణికులకు కళ్ళలోకి వెళ్లడం తో రోడ్డు కనిపించడంలేదని ,హెచ్చిరిక బోడ్లు , రోడ్డు ఇరువైపులా రేడియేషన్ బోర్డ్ లు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించగా గుత్తేదారు మాత్రం ఎంపీటీసీ అని కూడా గౌరవం లేకుండా దురుసుగా మాట్లాడారని ఎంపీటీసీ ఆవేదనవ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ చాకచక్యంగా.వాహనము నడపడం వాళ్ళ పెను ప్రమాదం తప్పిందని అన్నారు.