అల్లూరి జిల్లా,హుకుంపేట : నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు డిప్యూటీ విద్యాశాఖ అధికారి నియమితులైన సోమెలి చెల్లయ్య మండల విలేకర్ల సంఘం అధ్యక్షులు కొర్ర ఆనంద్ అధ్వర్యంలో దుస్సలువ కప్పి ఘనంగా సన్మానించారు. ముందుగా సంఘం సభ్యులు పి, లింగమూర్తి,శివ కనక రాజు మరియు గిరిజన సంఘం కార్యదర్శి టి, క్రిష్ణారావులు పుష్ప గుచ్చం అందించి, మిఠాయి తినిపించి సంఘం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..హుకుంపేట మండలంలోని మారుమూల ప్రాంతానికి చెందిన రాప పంచాయితీ,గొందిరాప గ్రామానికి చెందిన సోమెలి పుల్లన్న,భిమలమ్మ దంపతుల రెండవ సంతానం చెల్లయ్య ఉపాధ్యాయు వృత్తిలో కొలువు దీరి, ప్రధాన ఉపాధ్యాయు లుగా,మండల విద్యాశాఖ అధికారిగా,నేడు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి నియమితులవ్వడం గిరిజన జాతికి ఎంతో గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమానికి విలేకర్ల సంఘం నాయకుులు తోతదితరులు పాల్గొన్నారు
