- తీవ్ర ఆందోళన చెందుతున్న ప్రజలు
- రోడ్డు విస్తరణలో బహుళ నిర్మాణా దారులు బలి
- అధిక సంఖ్యలో నష్టపోనున్న గిరిజనేతరులు
- త్వరతిగతిన మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు!
అల్లూరి జిల్లా,హుకుంపేట, ది రిపోర్టర్ న్యూస్ ,:మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంలో రెవెన్యూ అధికారులు బుధవారం నాడు జరిపించిన సర్వే, మండల కేంద్ర వాసులకు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. రోడ్డు విస్తరణ పనులు చేయాల్సిందే! వాస్తవానికి మండల కేంద్రంలో ప్రభుత్వం పూర్తిస్థాయి రోడ్డు
విస్తీర్ణం పనులు చేపడితే ఇద్దరు, ముగ్గురు గిరిజనులకు పాక్షికంగా నష్టం కలగవచ్చు గాక,కానీ అధికశాతం గిరిజనేతరులు అక్రమంగా బహుళ నిర్మాణాలు నిర్మించుకొన్నారు. శాశ్వత భవనాలు,దుఖాన సముదాయాలు,రొడ్డుపైనే నిర్మించుకున్నారు. వీటిపై గిరిజన సంఘలు చేపట్టిన చిన్న, చితక నిరసనలు తప్ప!విలాసవంతమైన జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రహదారి విస్తణ పనులు చేపడితే,మండల కేంద్రానకి చెందిన వలసవాదులకు (గిరిజనేతరులు) తీవ్ర నష్టం వాటిల్లవచ్చు, కానీ ఆ నిర్మాణాలంతా అక్రమనిర్మాణాలే.
వాస్తవానికి గిరిజనులకు జరిగిన నష్టానికి ఇది పెద్దగా లెక్కలో రాకపోవచ్చు. అయినా చెప్పుకోలేనంత మనోవేదన చెందుతున్నారు.
ఇది ఇలా ఉంటే… ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి – 516 (రాజమండ్రి నుండి విజయనగరం) నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఇదే గిరిజనేతరులు కొద్దిమంది గిరిజనులకు ప్రలోబాలకు గురిచేసి,తమ ఆస్తులను కాపాడుకోవడం కోసం జాతీయ రహదారినీ గిరిజనుల పంట పొలాలపై మళ్లించారు.జిల్లా కేంద్రానికి అనుకొని ఉన్న హుకుంపేట మండల కేంద్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని అవసరార్థం కనెక్టివిటీ రోడ్డు విస్తరణ చేపట్టడానికి ప్రభుత్వం సర్వే చేపడితే,,వీటిని కూడా ఎలాగోలా అడ్డుకోవడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఉన్నది పోయే – ఉంచుకొన్నాదీ పోయే అన్న చందంగా తయారైంది. హుకుంపేట మండలం వలసవాదుల తీరు. గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలపైన,జాతీయ రహదారినీ గిరిజనుల పంట పొలాలపై మళ్లించడం పైన అనేక ఉద్యమాలు చేశారు. వీటిపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజన సంఘల నాయకులు అనేక మార్లు పిర్యాదు చేశారు.దీనిపై గిరిజన సంఘం నాయకులు టి.క్రిష్ణ రావు మరియు దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ నాయకులు పి.రంజిత్ కుమార్ వివరణ కోరగా,, జిల్లా కలక్టర్ రోడ్డు విస్తరణ పనులు తక్షణమేచేపట్టాలన్నారు. అధికార్లు ఇప్పటికే తీవ్ర నిర్లక్ష్యం చేశారన్నారు. రహదారికి అడ్డంగా రోడ్డుమీద మీద నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని అధికారులకు గిరిజన సంఘం అనేకమార్లు పిర్యాదుచేసిందన్నారు.ఇప్పటికైనా రోడ్డు విస్తరణ పనులు చేపట్టి పూర్తి స్థాయి రోడ్డు అందుబాటులో తేవాలన్నారు.
BSB HOME Microfiber 144 TC Football Printed Double Bedsheets with 2 King Size Pillow Cover (90X90 Inches, 7.5 x 7.5 Feet, Dark Blue and Light Blue)