- హుకుంపేట మండల కేంద్రంలో ఆటకెక్కిన 1/70 చట్టం ..?
- దీని వెనక గిరిజన ప్రజా ప్రతినిధుల మద్దతు ఉందా…?
- ఎద్దేచగా బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణలు..?
- బడాబాబుల చేతుల్లో బందీ అవుతున్న ఏజెన్సీ చట్టాలు.?
అల్లూరి జిల్లా, హుకుంపేట : అధికారుల అండదండలు ఉంటే ఏదైనా చెయ్యొచ్చా ఏజెన్సీ చట్టాలను సైతం తుంగలో తొక్కి గిరిజనేతరుల బహుళ అంతస్తుల నిర్మాణం అడ్డూ అదుపు లేకుండా నిర్మిస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. 1/70చట్టాన్ని అటకెక్కించి అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగిస్తున్నా సంబంధిత శాఖ అధికారులు నోరుమెదపని కథనమిది…..!
మండల పరిధిలోని బడాబాబులకు మూడు,నాలుగు బహుళ అంతస్తులు నిర్మిస్తు న్నారు. అయితే ఈనిర్మాణాలకు ఎటువంటి అనుమతి లేదు. పంచాయతీ అధికారుల అనుమతి అసలే లేకపోవడం గమనార్హం. పంచాయతీ అధికా రుల అనుమతి లేకుండా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారంటే దీని వెనుక ఎవరిహస్తం ఉందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మండల కేంద్రం అక్రమ కట్టడాలకు అడ్డాగా మారింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురగా అక్రమంగా అధిన సంతోష్ అనే గిరిజనేతరుడు పట్టపగలే బహుళ అంతస్తుల నిర్మాణం ఎద్దేచగా చేపడుతుంటే అధికారులు మాత్రం చూసిచూడనట్టు వ్యవరిస్తున్నారు. దొడ్డి ప్రసాదు అనే గిరిజనేతరుడు బహుళ అంతస్థు ఎద్దేచగా నిర్మాణం చేపడగున్నాడు. ఆ గ్రామంలో ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడ్డా అక్కడ పాగా వేస్తూ అక్రమ కట్టడాలు కొనసాగిస్తున్నారు. ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగిస్తున్నారు.
అయితే ఏజెన్సీ ప్రాంతంలో అనుమతి లేకుండా అక్రమ కట్టడాల నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు నిద్రమత్తులో ఉన్నారా అంటూ గిరిజన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల వ్యవహారంలో ప్రభుత్వ నిబంధనలను బడాబాబులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అధికారులకు భారీగా ముడుపులు చేరడం వలననే పట్టించుకోవడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి . మండల స్థాయి అధికారులు, జిల్లా అధికారులు వారికి కొమ్ముకాస్తున్న కారణంతో ఎటువంటి చర్యలు తీసుకునే సాహసం చేయలేకపోతున్నారు. అక్రమాలను,దందాలను అడ్డుకోవాల్సిన అధికారులే ఇలా ముడుపులకు అలవాటు పడితే వాటికి అడ్డుకట్టు వేసేది ఎవరని ప్రశ్నిస్తున్నారు గిరిజన ప్రజలు.
అక్రమ నిర్మాణాలపై మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ముందు ముందు ఇలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది.
.