అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో గిరిజనులకు కల్పించిన 1/70 భూ బదలాయింపు చట్టాన్ని ధిక్కరించి మండలంలోని మండల నడిబొడ్డున కాపురాపా గంగరాజు కామయ్యపేటకు వెళ్లే మార్గంలో సోమలింగం అనే గిరిజనేతురులు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు.అరకు పాడేరు ప్రధాన రహదారికి ఇరువైపులా శాశ్వత గృహ నిర్మాణాలు షాపులు నిర్మించుకుంటున్నా సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.గిరిజనేతరు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని స్థానిక గిరిజన సంఘాలు గిరిజనులు కోరుతున్నారు లేనియెడల భారీస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.