- అక్రమ నిర్మాణాల అంశం గ్రామసభ అజెండాలో చేర్చాలి!
- రెవెన్యు అధికారులకు ఐటిడిఎ పిఓ ఇచ్చిన గడువు ముగిసింది .
- దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలు బహిర్గతం చేయాలి … ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్
అల్లూరి జిల్లా / హుకుంపేట: గిరిజనేతరుల అక్రమ నిర్మాణాల పై గిరిజన సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండల కేంద్రంలో ఐటిడిఎ పిఓ, వి.అభిషేక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శర్మ ఈనెల 13న తనిఖీలు చేపట్టారు. అనంతరం రెవెన్యూ అధికారులను సమగ్ర దర్యాప్తు చేసి ఆగస్టు 20వ తేదీన రిపోర్ట్ అందజేయాలని ఆదేశాలు జారీ చేసారు. కానీ నేటివరకు రెవెన్యూ అధికారులు గిరిజనేతరుల అక్రమ నిర్మాణాల పై రిపోర్ట్ లేదు, స్పందన లేదు.
రెవెన్యు అధికారుల దర్యాప్తులో వెలుగుచూసిన విషయాలను హుకుంపేట పంచాయితీలో జరిగే గ్రామసభలో అక్రమ నిర్మాణాలపై వివరాలు వెల్లడించాలని, చర్చ జరపాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేసాయి. లేదంటే పోరాటం ఉదృతం చేస్తామని పి.సోమన్న,
టి. క్రిష్ణరావు తెలిపారు