contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్‌పై రేప్ కేసు నమోదు

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తెలంగాణలోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అత్యాచారం చేశాడంటూ ఓ లేడీ డాన్సర్‌ రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్​ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగ్ పీఎస్‌కు బదిలీ చేశారు. ఈ ఘటనపై నార్సింగ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

‘ఢీ’ అనే డ్యాన్స్ రియాల్టీ షోతో కొరియోగ్రాఫర్​గా తన కెరీర్‌ను ప్రారంభించిన జానీ మాస్టర్ ఆ తర్వాత టాలీవుడ్​లో వరుస ఛాన్సులు దక్కించుకున్నాడు. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్​, రామ్ పోతినేని, రవితేజ వంటి హీరోల పాటలకు కొరియోగ్రఫీ చేశాడు. కోలీవుడ్, శాండల్​వుడ్​, బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలోనూ తన సత్తా చాటుతున్నాడు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :