- కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వార్షిక కోలాక్వీలో అభిప్రాయపడ్డ వక్తలు
భారతదేశం కోసం సమగ్ర విధానాలను రూపొందించి, దేశ సమ్మిళితాభివృద్ధికి మనవంతు చేయూతనిద్దా మని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ద్వైవార్షిక కొలాక్వీలో భాగంగా శనివారం ‘భారతదేశం కోసం సమగ్ర విధానాలు’ అనే అంశంపై ముఖాముఖి చర్చలను నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో విభిన్న రంగాలకు చెందిన ప్రభుత్వ, ప్రభుత్వేతర నిపుణులు, ఉన్నతాధికారులు పాల్గొని. ఆయా అంశాలపై తనదైన శైలిలో పరిష్కార మార్గాలు చూపడంతో పాటు పలు సూచనలు చేశారు. తొలుత, ఈ కార్యక్రమాన్ని పబ్లిక్ పాలసీలో మహిళలు, ఆర్థిక రంగ భవిష్యత్తు, డిజిటల్ పాలన, వాతావరణ మార్పులు, పర్యావరణ-సామాజిక పాలన అనే అంశాలు కౌటిల్యా పబ్లిక్ పాలసీ విద్యార్థులు పత్ర సమర్పణ చేశారు. ఆ తరువాత ఆయా ప్రత్యేక అంశాలపై విడివిడి ముఖాముఖి చర్చలు (ప్యానెల్ డిస్కషన్స్) నిర్వహించారు.ఆర్థిక రంగ భవిష్యత్తుపై నిర్వహించిన చర్చలో డాక్టర్ రతిన్ రాయ్, చేజ్ ఇండియా ఉపాధ్యక్షుడు కౌశల్ మహన్, ఐఆర్సీఎస్ పూర్వ అధికారి పర్మిలా చావలీ పాల్గొన్నారు.
పబ్లిక్ పాలసీలో మహిళలు అనే అంశంపై వీ వాబ్ అసోసియేట్ డైరెక్టర్ శాంతలా వీగాస్, తెలంగాణ ప్రభుత్వ పూర్వ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత, హెర్టీ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ ముజుహీద్ షేక్ పాల్గొన్నారు.
డిజిటల్ గవర్నెన్స్ చర్చలో రేజర్ పే ఇండియా డైరెక్టర్ శరణ్య గోపీనాథ్, డెలాయిట్ సీఐవో సుదీర్ఘ నీరసినేని, నాస్కామ్ ఫౌండేషన్ డైరెక్టర్ విక్రమ్ పాటిల్, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్-ఐఏఎస్ పాల్గొన్నారు.
వాతావరణ మార్పులపై జరిగిన చర్చలో అశోక్ లేలాండ్ కార్పొరేట్ స్ట్రాటజీ హెడ్ అలోక్ వర్మ, సంబోధి డిప్యూటీ ఉపాధ్యక్షుడు అభిషేక్ శర్మ, గ్రాంట్ థార్న్ టన్ భారత్ ఎల్ఎల్ పీ డైరెక్టర్ మోహన్ కుమార్ పాల్గొన్నారు.అప్పటికే ఆయా అంశాలపై పత్ర సమర్పణ చేసిన విద్యార్థులు నిపుణుల అభిప్రాయాలను ఆసాంతం ఆలకించడంతో పాటు సలు సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.కౌటిల్యా స్కూల్ డీన్ సయ్యద్ అక్బరుద్దీన్, పలువురు ఆధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ఈ ఒకరోజు ప్రత్యేక చర్చాగోష్ఠిని విజయవంతం చేశారు.