హైదరాబాద్: కేటీఆర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ ప్రతినిధుల బృందం అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ జిహెచ్ఎంసి సుందరీకరణ పనులు చేపట్టగా.. అంబేద్కర్ కు అడ్డుగా కూడా అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో, మరియు కేటీఆర్ ప్రోత్బలంతో నడిచే సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ల ద్వారా అబద్దాలు, తప్పుడు రాతలు ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా కేటీఆర్ కుట్ర చేస్తున్నారని తన అనుచరుల ద్వారా కుట్రను సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని.. అంబేద్కర్ విగ్రహం చుట్టూ సుందరీకరణ కోసం కట్టిన గోడను టిఆర్ఎస్ నాయకులు కూల్చీ వేసారు, ఈ చర్య దళితుల యొక్క ఆత్మాభిమానo దెబ్బతీస్తుందని, రాజ్యాంగ నిర్మాత కు జరిగిన ఈ అవమానం భారత పౌరులందరిని కలిసి వేసిందని, ఇట్టి చర్యలను ఖండిస్తూన్నామని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేయకుండా ఉండడానికి సరైన బుద్ధి చెప్పే విధంగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని, కేటీఆర్ మరియు కృషాంక్ మరియు పిఏ తిరుపతి మరియు ఇతర టిఆర్ఎస్ నాయకుల పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. ఎస్సీ సెల్ అధ్యక్షులు నగరిగారి ప్రీతం నేతృత్వంలో, తెలంగాణ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవర్తి అనిల్, ముత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి డా. కొనగాల మహేష్ లు ఫిర్యాదు చేశారు.