హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. కలెక్టరేట్‌లో బాంబు పెట్టినట్లు ఏవోకు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు అందాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో కలెక్టరేట్ ఆవరణలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
అయితే, అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మరోవైపు, బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.