తెలంగాణ : హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో ఇటీవల అర్ధరాత్రి దాటాక పోలీసుల సోదాలు చేయగా డ్రగ్స్ లభ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పబ్‌లో పట్టుబడిన వారిలో 20 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు లభించడంతో వారందరికీ నోటీసులు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఇందులో సినీ ప్రముఖులు, రాజకీయ నేతల పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ వ్యవహారం అంతా ఆ పబ్ మేనేజర్ అనిల్‌తో పాటు మరో నిందితుడు అభిషేక్ ఆధ్వర్యంలోనే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అభిషేక్ కాంటాక్ట్ లిస్ట్ ను పరిశీలించిన అధికారులు అందులో గోవా, ముంబైకి చెందిన కొంతమంది పేర్లు ఉన్నట్లు తేల్చారు.
గతంలో డ్రగ్స్‌తో పట్టుబడిన సరఫరాదారుల పేర్లు అనిల్ కాంటాక్ట్ లిస్ట్‌లోనూ ఉన్నట్లు గుర్తించారు. గోవా, ముంబై నుంచి అనిల్ ఇక్కడకు డ్రగ్స్ తెప్పించినట్లు తెలుస్తోంది. పోలీసులు నోటీసులు జారీ చేయనున్న ఆ 20 మంది ఎవరు? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.